![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -197 లో..... గంగని శకుంతల దృష్టిలో బ్యాడ్ చెయ్యడానికి ఇషిక వేసిన ప్లాన్ రుద్రకి తెలుస్తుంది. నువ్వు ఎందుకు అలా చేస్తున్నావ్.. ఇది రెండోసారి గంగని టార్గెట్ చెయ్యడం.. చదువు, ఆస్తులు పక్కన పెడితే గంగ కాలిగోటికి కూడా సరిపోవని రుద్ర అన్నమాటలు ఇషిక గుర్తుచేసుకొని కోపంతో రగిలిపోతుంది. మరొకవైపు భాను కేసు రీఓపెన్ చేయించి.. నా గురించి అందరికి నిజం తెలిసేలా చెయ్యాలనుకున్నావ్ కదా అని గంగతో వీరు అనుకుంటాడు.
గంగ కిచెన్ లో వంట చేస్తుంది. వాటర్ రాకపోయేసరికి అయ్యో వాటర్ అయిపోయినట్లున్నాయి మోటార్ వెయ్యాలని గంగ అనుకుంటుంది. ఇషిక మోటార్ ఆన్ చెయ్యవా అని చెప్తుంది. నేను ఎలా కన్పిస్తున్నాను నీకు అని ఇషిక కోపంగా అక్కడ నుండి వెళ్తుంది. దాంతో గంగనే మోటార్ వెయ్యడానికి వెళ్తుంది. అది విన్న వీరు.. గంగకి ఎదురుగా వెళ్లి.. గంగ ప్రీతీకి జ్యూస్ కావాలట.. నువ్వు వెళ్లి ఇవ్వు.. నేను మోటార్ వేస్తానని గంగని పంపిస్తాడు. ప్రీతీకి జ్యూస్ తీసుకొని వెళ్తుంది. నేను ఏం అడగలేదు గంగ అని ప్రీతీ అంటుంది. వీరు అన్నయ్య చెప్పాడు.. అయినా అన్నయ్యకి నువ్వు అంటే ఎంత ఇష్టం అని గంగ అంటుంది. నువ్వు ప్రెగ్నెంట్ అవ్వు.. నిన్ను అన్నయ్య ప్రేమగా చూసుకుంటాడని ప్రీతి అంటుంది.
నేను బాక్సింగ్ కి ట్రై చెయ్యడం లేదని కోపంగా ఉన్నాడని ప్రీతీకి గంగ చెప్తుంది. మరొకవైపు మోటార్ స్విచ్ దగ్గరికి వీరు వెళ్లి వైర్ కట్ చేస్తాడు. గంగకి షాక్ రావాలని గంగ కిచెన్ లోకి వస్తుంది. వాటర్ రాకపోయేసరికి మోటార్ వెయ్యలేదా అని మోటార్ దగ్గరికి వెళ్లి స్విచ్ వేస్తుంది. దాంతో తనకి షాక్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |